Raj Tarun కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నాగార్జున.. లావణ్య నుండి తప్పించునే మార్గం దొరికేసిందిగా!

- Advertisement -

Raj Tarun : ప్రస్తుతం మీడియా లో రాజకీయ నాయకులూ, స్టార్ హీరోలకంటే కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న హీరో రాజ్ తరుణ్. తన మాజీ ప్రేయసి లావణ్య ఇతన్ని ఎన్ని విధాలుగా ముప్పు తిప్పలు పెడుతుందో ప్రతీ రోజు మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇందులో రాజ్ తరుణ్ తప్పు ఏమాత్రం లేదని ఇటీవల లావణ్య ఆడియో రికార్డింగ్స్ విన్న తర్వాత అందరికీ అర్థం అయ్యింది. అయితే నిన్న రాజ్ తరుణ్, ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తిరగబడరా సామీ’ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ని విలేఖరులు ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. లావణ్య గురించి మాట్లాడడమే తప్ప, ఒక్కరు కూడా సినిమా గురించి మాట్లాడలేకపోయారు.

Raj Tarun
Raj Tarun

అయితే ఈ ప్రెస్ మీట్ కి కూడా లోపలకి వచ్చేందుకు లావణ్య తెగ ప్రయత్నం చేసింది. మీడియా ముందు నానా హంగామా కూడా చేసింది. అనంతరం ఆమె రాత్రి సమయం రాజ్ తరుణ్ మరియు అతని తల్లితండ్రులు ఉన్న ఫ్లాట్ కి వెళ్లి తలుపు తియ్యండి అంటూ పెద్ద ఎత్తున గొడవలు చేసింది. ఇదంతా చూస్తుంటే ఆమె రాజ్ తరుణ్ ని అసలు ఏమాత్రం వదిలేలా లేదు అనిపిస్తుంది. తప్పు తనవైపు లేకపోయినా రాజ్ తరుణ్ బయట ప్రతీ రోజు మానసికంగా ఎంతో వేదనకు గురి అవుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఆయనకీ త్వరలో బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి.

Raj Tarun | లావ‌ణ్యకు భ‌య‌ప‌డ‌ను.. న్యాయం జరిగే వరకు పోరాడుతా : రాజ్‌తరుణ్‌-Namasthe Telangana

- Advertisement -

అయితే రాజ్ తరుణ్ కాస్త పెద్ద స్థాయి ఉన్న హీరో కదా, ఈ షో లో పాల్గొనేందుకు అంగీకరించడేమో అని అందరూ అనుకున్నారు. కానీ బయట ఉంటూ లావణ్య తో ఈ నరకం అనుభవించేదానికంటే, బిగ్ బాస్ హౌస్ లో ఒక మూడు నెలలు గడిపి, సరికొత్త ఇమేజితో బయటకి రావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల మొదటి వారం నుండి ఈ షో స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ షో లో రాజ్ తరుణ్ తో పాటుగా గాయత్రీ గుప్తా, ప్రభాస్ శ్రీను మరియు యాంకర్ వింధ్యా వంటి వారితో పాటు తేజశ్వని గౌడా వంటి వారు కూడా ఈ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here