Akkineni Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తో అక్కినేని నాగార్జున కి ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో దశాబ్దాలుగా మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే అన్నదమ్ములు లాగానే అనిపిస్తారు. వాళ్ళ మధ్య ప్రేమ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కేవలం చిరంజీవి తో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా నాగార్జున కి ఎంతో గొప్ప రిలేషన్ ఉంది. కానీ నాగార్జున మాత్రం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తో కలిసున్న సందర్భాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

పలు ఈవెంట్స్ లో కనపడినప్పుడు మాట్లాడుకోవడమే కానీ, ప్రత్యేకంగా పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ ని నాగార్జున కలిసిన సందర్భాలు లేవు. కానీ అనేకసార్లు నాగార్జున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన సహాయం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. వీళ్ళ మధ్య ఇంత సీక్రెట్ బాండింగ్ ఉందా అని అనుకున్నారు ఈ సంఘటన తర్వాత.

అసలు విషయానికి వస్తే నిన్న పవన్ కళ్యాణ్ వైజాగ్ లో మత్స్యకారులకు నష్టపరిహారం అందించేందుకు హార్బర్ కి విచ్చేశాడు. అక్కడి వచ్చేందుకు పవన్ కళ్యాణ్ కి ఫ్లైట్ మిస్ అయ్యింది. మరో ఫ్లైట్ అందుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉండడం తో నాగార్జున కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చెయ్యగా, ఆయన ప్రత్యేక విమానం ని పవన్ కళ్యాణ్ కోసం పంపించాడు.

ఇప్పటి వరకు ఈ విమానం ని నాగార్జున తన కోసం తన కొడుకుల కోసం తప్ప ఎవరి కోసం ఉపయోగించలేదు అట. అలాంటిది పవన్ కళ్యాణ్ అడగగానే ఇచ్చేశాడంటే ఆయన మీద ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ ఫ్లైట్ విలువ రెండు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. అలా బయట ఎక్కువగా ఈ ఇద్దరు కనిపించకపోయినా, వీళ్ళ మధ్య ఇంత రహస్య స్నేహం ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.