Akkineni Nagarjuna : ఈ బిగ్ బాస్ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున కంటెస్టెంట్ శివాజీ కి దాసోహం అయిపోయాడని, అతని తప్పులను , పొరపాట్లను కప్పిపుచ్చేందుకు నాగార్జున ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతీ వీకెండ్ వ్యవహరించే తీరు అలాగే ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ మేట్స్ అందరితో ఒకలాగా, శివాజీ తో మరోలాగా నాగార్జున వ్యవహరిస్తున్నాడు అనేది నెటిజెన్స్ అభిప్రాయం.
అందుకు ఉదాహరణ నిన్న జరిగిన ఎపిసోడ్ అని అంటున్నారు. ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కు లో వీర సింహాలు మరియు గర్జించే పులులు టాస్కులో బాల్స్ ని దొంగిలించడం కూడా ఒక భాగమే అనే విషయాన్ని బిగ్ బాస్ అనేక సార్లు హింట్ ఇస్తాడు. కానీ శివాజీ మాత్రం నా దగ్గర దొంగతనం చేస్తే మర్యాదగా ఉండదు, నీతిగా నిజాయితీగా ఆడండి అంటూ క్లాస్ పీకిన సంగతి అందరికీ తెలిసిందే.
మధ్యలో గౌతమ్ టాస్కు గురించి శివాజీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యగా డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా దొంగతనం చెయ్యడం గురించి మాట్లాడుతున్నావ్, జనాలు చూస్తున్నారు, క్యారక్టర్ ని మైంటైన్ చెయ్ అంటూ చాలా సీరియస్ గా మాట్లాడుతాడు. కెప్టెన్ అయ్యుండి దొంగతనం చేయమంటున్నాడు అంటూ హౌస్ మేట్స్ లో అందరికీ ఎక్కిస్తాడు శివాజీ. ఇదంతా ఆయన మనసులో నుండి వచ్చిన మాటలే. కానీ నాగార్జున దీనిని కవర్ చేస్తూ శివాజీ చేసింది మొత్తం స్ట్రాటజీ, మీరు ఆయన ట్రాప్ లో పడి ఆటని నాశనం చేసారు అంటూ మాట్లాడుతాడు.
శివాజీ కి స్ట్రాటజీ వేసిన విషయం శివాజీకి కూడా తెలీదు కానీ, నాగార్జున అది స్ట్రాటజీ అని ప్రకటించడం తో హౌస్ మేట్స్ తో పాటుగా , ఆడియన్స్ కూడా షాక్ కి గురి అయ్యారు. తానూ స్ట్రాటజీ వాడలేదు అని తెలిసి కూడా నాగార్జున అందించిన మాటలను ఫాలో అయిపోయి అవును నేను స్ట్రాటజీ నే వాడాను అని తల ఊపుతాడు శివాజీ. ఇదంతా చూసిన తర్వాత ఆడియన్స్ ఇక హోస్టింగ్ జాబ్ ని కూడా శివాజీ కి ఇచ్చేసి కప్ కూడా ఆయనకే ఇచ్చేయండి అంటూ నాగార్జున ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.