టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల శాకంతులం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేదు. ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. అదేమిటంటే హీరోయిన్లకు గుడి కట్టించే పద్ధతి తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ఆ పద్ధతి తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిపోయింది అని, ఒక అభిమాని సమంత కోసం ఒక గుడి నిర్మిస్తున్నారు అని సమాచారం.

ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఆలపాడు కు చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లో సమంత కోసం గుడిని నిర్మిస్తున్నారని వార్త వెలుగులోకి వచ్చింది.
సమంత పై ఉన్న అభిమానంతో ఆయన ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం వంటి దేవాలయాలకు వెళ్లి వచ్చాడు. ఇటీవల ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్రలకు వెళ్లి వచ్చాడు. ఇకపోతే ఇప్పటికే విగ్రహం చివరి దశకు చేరుకొందని.. ఆ విగ్రహానికి సంబంధించిన గోపురం పనులు కూడా చేయిస్తున్నాడని వార్తలు బయటకు రావడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం తెలిసిన తర్వాత అక్కినేని అభిమానులు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు. శాకుంతలం సినిమా డిజాస్టర్ అయ్యింది కదా ఆ నెగెటివిటీ తనపై పడకుండా ఇలా గుడి కట్టించుకుంటూ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. క్రేజ్ కోసం డ్రామాలాడుతోంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ వాస్తవానికి సమంత సాకుంతలం సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఆమె తన దృష్టిని అంతా సిటాడేల్ మూవీ సీరీస్ పైనే పెట్టింది కానీ కావాలని అక్కినేని అభిమానులు ఆమెపై ఇలాంటి బురద చెల్లే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి.