Akira Nandhan : మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడే హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే. తండ్రి పోలికలతో వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తుండడంతో.. అభిమానులు అకీరాను టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అకీరా ఒకపక్క చదువుకుంటూనే.. ఇంకోపక్క సంగీతం, మార్షల్ ఆర్ట్స్ లాంటి కళలు నేర్చుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ సంక్రాంతి వేడుకల్లో అకీరా తన టాలెంట్ ను చూపించాడు.

అకీరా పియానో ఎంతో బాగా వాయిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక షార్ట్ ఫిల్మ్ కి కూడా ఈ కుర్రాడు సంగీత దర్శకుడుగా చేశాడు. అంతేకాకుండా ఎన్నోసార్లు రేణు.. అకీరా మ్యూజిక్ వీడియోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. తాజాగా కుటుంబ వేడుకలు అకీరా తన టాలెంట్ ను చూపించాడు. యానిమల్ సినిమాలో తండ్రి కొడుకుల బంధానికి నిదర్శనంగా నిలిచిన నాన్న నువ్వు నా ప్రాణం సాంగ్ ను పియానో పై వాయించి అదరగొట్టాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అకీరా టాలెంట్ ను ప్రశంసించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వేడుకలకు పవన్ రాలేదు అన్న విషయం తెలిసిందే. దీంతో కొడుకు టాలెంట్ ను తండ్రి చూడలేకపోయాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పక్కనే పవన్ ఉండుంటే ఎంత బాగుండేదో అంటూ చెప్పకొస్తున్నారు. మరి త్వరలోనే అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? లేక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.