Akira Nandan : రేణు దేశాయ్ రెండవ పెళ్లి కోసం ఏ కొడుకు చెయ్యని త్యాగం చెయ్యబోతున్న అకీరా నందన్!

- Advertisement -

Akira Nandan : పవన్ కళ్యాణ్ తో దాదాపుగా పదేళ్ల పాటు కాపురం చేసి, ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోయిన రేణు దేశాయ్ గురించి మన అందరికీ తెలిసిందే. ఆయనతో విడిపోయిన తర్వాత కూడా స్నేహం గానే ఉంటుంది. కలిసినప్పుడు మంచిగా నవ్వుతూనే మాట్లాడుకుంటారు. వీళ్లిద్దరికీ అకిరా నందన్ మరియు ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

Akira Nandan
Akira Nandan

వీళ్లిద్దరు తమ తల్లికి ఒక తోడు కావాలని ఎప్పటి నుండో రెండవ పెళ్లి చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా ఒక పిల్లల కోరిక మేరకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో రేణు దేశాయ్ నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఇప్పటి వరకు ఆమె అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. ఇకపోతే రీసెంట్ గా ఆమె రవితేజ హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.

Akira Nandan Renu Desai

ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమెని యాంకర్స్ రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగారు. అప్పుడు రేణు దేశాయ్ నా పిల్లలిద్దరూ జీవితం లో స్థిరపడిన తర్వాత చేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది. మొదటి నుండి ఆమె అకిరా నందన్ కి మంచి జీవితం రావాలి, ఉన్నత స్థాయి దక్కాలి అని కోరుకుంటూ ఉండేది.

- Advertisement -
Akira Nandan  Pawan Kalyan

ఆమె మనసులో అకిరా నందన్ హీరో గా ఎంట్రీ ఇస్తే చాలా తేలికగా జీవితం లో స్థిరపడుతాడు, అది జరిగితే బాగుండును అని కోరుకుంది. కానీ అకిరా కి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక. కానీ అమ్మ మనసులోని కోరికని అర్థం చేసుకున్న అకిరా, తానూ ఎంచుకున్న మ్యూజిక్ రంగం ని పక్కన పెట్టి, హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఆయన అమెరికా లోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. మరో మూడు సంవత్సరాలలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here