Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకుగా అకిరా నందన్ కి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది.ఆయన తల్లి రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు అకిరా నందన్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.ఇది వరకే ఆయన కర్ర సాము చేసిన వీడియోలు మరియు కీ బోర్డు వాయిస్తున్న వీడియోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చాలానే షేర్ చేసింది.

అకిరా నందన్ కటౌట్ మరియు అందం ని చూసి ఇండస్ట్రీ లో హీరో గా అడుగుపెడితే ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్తాడు,తండ్రికి మించిన తనయుడు అవుతాడని అందరూ అనుకున్నారు.కానీ రేణు దేశాయ్ ముందు నుండి చెప్తూనే ఉంది, అకిరా కి సినిమాల మీద ఆసక్తి లేదు,అతని మ్యూజిక్ మీదనే అమితాసక్తి ఉంది అని.ఆమె చెప్పినట్టుగానే అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చేసాడు.

అది సినిమాకి మాత్రం కాదులేండి, కార్తికేయ యార్లగడ్డ అనే యూట్యూబర్ చేసిన షార్ట్ ఫిలిం ‘రైటర్స్ బ్లాక్’ కి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.ఈ షార్ట్ ఫిలిం ని నేడు ప్రముఖ హీరో అడవి శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసాడు.ఈ వీడియో లో అభిమానులు అకిరా నందన్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడో చూద్దామనే ఉద్దేశ్యం తోనే ఓపెన్ చేసి చూసారు.

ఎదో టైం పాస్ కోసం మ్యూజిక్ ఇచ్చినట్టు కాకుండా,ఒక ప్రొఫెషినల్ మ్యూజిక్ డైరెక్టర్ లాగ అకిరా నందన్ ఎంతో చక్కగా సంగీతం అందించాడు.రీ రికార్డింగ్ మరియు సౌండ్ మిక్సింగ్ కూడా అదిరిపోయింది.కుర్రాడు మ్యూజిక్ అదరగొట్టేసాడు, నీ తదుపరి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా నీ కొడుకు అకిరా నందన్ ని పెట్టుకో అన్నా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో ట్వీట్స్ వేస్తున్నారు.అకిరా నందన్ మ్యూజిక్ అందించిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.