Pawan Kalyan : అకీరా నందన్.. చంద్రబాబు కాళ్లకు మొక్కడం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా ?

- Advertisement -

Pawan Kalyan : ఒకరు బాగుపడితే కొందరు అస్సలు ఓర్వలేరు. ఇది అందరికీ తెలిసిందే. వాళ్లను బాధపెట్టేందుకు.. హింసించేందుకు.. టార్చర్ కు గురి చేయడానికి ఏదో ఒక కారణంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. కాగా తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను బాధ పెట్టడానికి కొందరు ఆకతాయలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు 70వేలకు పైగాద భారీ మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్ . ఈ విక్టరీ మూమెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు .

మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ గెలిచాడన్న విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు ఆయనను డైరెక్టుగా కలిసి సన్మానించారు. ఈ క్రమంలోనే అకీరా – పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా కూడా చంద్రబాబును సన్మానించారు. ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అకీరాని పరిచయం చేస్తున్న క్రమంలో అకీరా చంద్రబాబు కాళ్లకు మొక్కాడు . ఇది చాలా గౌరవప్రదంగా జరిగింది. మన తెలుగు సాంప్రదాయంలో ఎవరైనా సరే.. మనకంటే వయసులో పెద్దవాళ్లు కనిపిస్తే నమస్కరించడం, వారి ఆశీర్వాదాలు కోరడం మంచిదని భావిస్తుంటారు.

- Advertisement -

అయితే పవన్ కళ్యాణ్ కూడా అకీరా విషయంలో చేపించారు . కొంతమంది మాత్రం అప్పుడే పవన్ కళ్యాణ్ భవిష్యతులో కొడుకు రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నాడని చంద్రబాబుకు బిస్కెట్స్ వేస్తున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు అకీరా రాజకీయాల పరంగా సినిమాలు పరంగా ఆయన వారసుడిగా రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు కావాలని మాట్లాడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తిప్పి కొడుతున్నారు. ప్రస్తుతం అకీరా, చంద్రబాబు కాళ్లకు మొక్కిన ఫొటోస్ వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here