Pawan Kalyan : తన తండ్రి కోసం ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అకీరా.. తెగ మురిసిపోతున్న పవన్ కళ్యాణ్

- Advertisement -

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల పూర్తయిన ఎన్నికల తర్వాత ఆయన పేరు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో మార్మోగిపోతుంది. ఏపీలో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 100 స్ట్రైక్ రేటుతో గెలిచారు. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వంలో కీలక మంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్ల తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్‌తో పాటు అతడి కొడుకు అకీరా నందన్ పేరు కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. తండ్రి గెలిచిన తర్వాత.. తన పక్కనే ఉంటూ దేశ రాష్ట్ర నాయకులకు కలుస్తూ ట్రెండింగ్ లో ఉన్నారు అకీరా.. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో అకీరా లుక్ ట్రెండ్ అవ్వడమే కాదు. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.. అయితే అకీరాకు నటన అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని ఆ మధ్య బాంబు పేల్చారు అతడి తల్లి రేణు దేశాయ్. ప్రస్తుతం అకీరా నందన్ మ్యూజిక్‌తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్స్‌పై ఫోకస్ చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా తండ్రి కోసం అకీరా చేసిన ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను స్వయంగా అకీరానే ఎడిట్ చేశాడట. ఆర్నెళ్ల కిందే చేసిన ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ల్లో ఉన్న మాంటేజ్ షాట్లు తీసుకుని .. మధ్య మధ్యలో డైలాగ్స్ యాడ్ చేస్తూ అద్భుతంగా ఎడిట్ చేశాడు అకీరా నందన్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.. అలా చేశారో లేదో వెంటనే వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. అకీరా తీరు, జోరు చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీకి రావడం పక్కా అనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here