Akhil: ఈ మధ్య సినిమాల ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్లు పెద్ద రిస్క్ చేస్తున్నారు.. కొంతమంది పబ్లిసిటీ కోసం వేరే వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళు ఫెమస్ అవుతున్నారు.. అలా చేసిన కూడా సినిమాలు అనుకున్న హిట్ ను అందుకోలేక పోయాయి.. తాజాగా అక్కినేని హీరో పెద్ద స్టంట్ చేసాడు.. సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద రిస్క్ నే చేసాడు.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా కష్టపడ్డాడు. కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్..

ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తప్ప మిగిలిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో, సాక్షి వైద్య హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ చేశారు. విజయవాడలో PVP మాల్ వద్ద ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించగా ఇక్కడ అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు..
PVP మాల్ బిల్డింగ్ పైనుంచి అఖిల్ దూకగా కింద అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అఖిల్ కిందకు దిగుతుంటే అఖిల్ పై పూల వర్షం, పేపర్స్ కురిపించారు. విజయవాడ ఫ్యాన్స్ అఖిల్ కి గ్రాండ్ గా స్వాగతం పలికారు. అఖిల్ పై నుంచి ఇలా తాళ్ల సాయంతో దూకిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారగా ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ లో స్టంట్స్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు అయితే ప్రమోషన్స్ కోసం అఖిల్ డేర్ చేస్తున్నాడు.. పెద్ద సాహసమే చేస్తున్నాడు.. సరికొత్తగా చేసాడు అంటూ ప్రశంసలు కురిపించారు.. ఇందుకు సంబందించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..