Akhanda 2 : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇక బాలయ్య కెరీర్ ముగిసిపోయింది అని ట్రేడ్ వర్గాలు సైతం అనుకుంటున్నా రోజుల్లో ‘అఖండ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత బాలయ్య దశ మారిపోయింది అనే చెప్పొచ్చు. అప్పటి వరకు కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ సినిమా కూడా లేని బాలయ్య, ఈ సినిమాతో ఏకంగా 70 కోట్ల మార్కుని అందుకున్నాడు.
ఈ సినిమా విడుదలైన సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ సరిగా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యిందని, లేకపోతే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేవని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ సినిమాని కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విరగబడి చూసారు.
ముఖ్యంగా అఖండ రోల్ లో బాలయ్య బాబు తప్ప ఇండియా లో ఏ హీరో కూడా చెయ్యలేరని క్రిటిక్స్ సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ ని సంప్రదించాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను.
బాలీవుడ్ లో ఒకప్పుడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో కొనసాగిన సంజయ్ దత్ ఈమధ్య మన సౌత్ సినిమాల్లో ఎక్కువ విలన్ రోల్స్ ద్వారా అలరిస్తున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 లో అధీరా క్యారక్టర్ ద్వారా అలరించిన సంజయ్ దత్, ఆ తర్వాత విజయ్ హీరో గా నటించిన ‘లియో’ చిత్రం లో విలన్ గా నటించాడు. ఇప్పుడు బాలయ్య అఖండ 2 లో కూడా విలన్ గా చెయ్యబోతున్నాడు. కానీ సంజయ్ దత్ భారీ కటౌట్ ముందు బాలయ్య నిలుస్తాడా అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.