Akash Puri : ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకుగా ఆకాష్ కి చిన్నతనం నుండే మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘చిరుత’ సినిమా ద్వారా ఆకాష్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ పాత్ర ని పోషించిన ఆకాష్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోల సినెమాలన్నిట్లో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ అవసరం అయితే ఆకాష్ ని తీసుకునేవారు.
అలా చిన్నతనం నుండే స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకున్న ఆకాష్ పెద్దయ్యాక పలు సినిమాల్లో హీరో గా నటించాడు కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. సక్సెస్ రాకపోయినా కూడా ఆకాష్ కి ఇంకా హీరో గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో అయినా అతనికి సక్సెస్ వస్తుందా లేదా అనేది.
సక్సెస్ సంగతి కాసేపు పక్కన పెడితే మనోడు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే ఒక కుర్ర హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడని ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. ఆమెతో కలిసి గోవా టూర్స్ వెయ్యడం, పార్టీలకు మరియు పబ్బులకు తిరగడం వంటివి తరచూ చేస్తున్నాడట. ఈమె కేవలం సినిమా హీరోయిన్ మాత్రమే కాదు, ఈమె ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి కూడా అట.
ఇంతకీ ఆమె ఎవరు ఏమిటి అనేది వివరాలు బయటకి రాలేదు కానీ, వీళ్లిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. జనవరి నెలలో నిశ్చితార్థం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియచెయ్యబోతున్నారట. సోషల్ మీడియా ద్వారా పూరి జగన్నాథ్ లేదా ఛార్మి ఈ పెళ్ళికి సంబంధించి వివరాలను షేర్ చేస్తారని తెలుస్తుంది.