Ravi Teja : ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఒక్క మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. హీరోలు, ప్రొడ్యూసర్లు తన వెంటపడేలా చేశాడు. కానీ అదంతా ఒక్క సినిమాకే పరిమితమైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రెండో మూవీ మహాసముద్రం డిజాస్టర్ గా మిగిలింది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు కాస్తా పోయింది. మహాసముద్రం.. పేరుకి తగ్గట్టే చాలా మందిని ముంచేసింది. దాంతో అజయ్ కెరీర్ ఎటు వైపు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

మహాసముద్రం తర్వాత కథ చెప్పడానికి ఎవరి దగ్గరకు వెళ్లినా పట్టించుకోలేదట.కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదంట. మహాసముద్రం తర్వాత అయినవాళ్లు ఎవరు.. కానివాళ్లు ఎవరో తెల్సుకున్నాడంట. మూవీ విషయంలో ఎవ్వరినీ నిందించడం లేదని, హిట్టూ, ఫ్లాపులే.. గౌరవాన్ని తెచ్చిపెడతాయన్నాడు అజయ్ భూపతి. అప్పట్లో… రవితేజతో చిన్న పాటి వివాదం కూడా నడిచింది. మహాసముద్రం కథ ముందు రవితేజ దగ్గరకు వెళ్లింది. చివరి క్షణంలో ఆయన తప్పుకొన్నాడు. చీప్ స్టార్ అంటూ అజయ్ భూపతి చేసిన ట్వీట్.. రవితేజ గురించే అని అప్పట్లో టాక్ నడిచింది. దీనిపై కూడా ఇప్పుడు అజయ్ భూపతి స్పందించాడు.
రవితేజతో ఇష్యూ చిన్నదే అని.. తనకు సరిపడా కథ కుదిరితో మూవీ చేయడానికి రెడీగా ఉన్నానని తేల్చి చెప్పాడు. దాంతో రవితేజతో ప్యాచప్ జరిగిపోయిందని టాలీవుడ్ జనాలు చెప్పుకొంటున్నారు. మరోవైపు అజయ్ భూపతి కొత్త సినిమా మంగళవారం విడుదలకు సిద్దంగా ఉంది. మహా సముద్రం హిట్టయినా, ఫ్లాపయినా, తన మూడో సినిమాగా ఇదే వచ్చేదని స్పష్టం చేశాడు. నాలుగో సినిమాకి సంబంధించిన కథ కూడా రెడీగా ఉందట. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. హీరో ఎవరో త్వరలో చెబుతా అంటున్నాడు ఆర్ఎక్స్ డైరెక్టర్.