తెలుగు భామ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. కెరీర్ ఆరంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషాల్లో రాణిస్తూ అదరగొడుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య.. తన కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు నాయికా ప్రాధాన్య సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారో వివరించారు. చాలామంది సినీ ప్రముఖులు తన నటనను ప్రశంసించారు కానీ, తనకు అవకాశం మాత్రం ఇవ్వడం లేదని అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘‘నా తొలి తమిళ సినిమా విడుదలయ్యాక ఎంతో మంది నాకు ఫోన్ చేసి ప్రశంసించారు. కానీ ఎవ్వరూ వారి చిత్రాల్లో అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఏడాదిన్నర పాటు నేను ఖాళీగా ఉన్నాను. పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఈ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే చాలా మంది నటీమణులకు అవకాశాలు రావడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది అగ్ర నటులు నన్ను, నా నటనను ఎన్నో వేదికలపై పొగిడారు. కానీ వాళ్ల సినిమాల్లో చిన్న పాత్ర కూడా ఇవ్వలేదు. దీంతో నేను చిన్న సినిమాలైనా.. నాయికా ప్రాధాన్యం ఉన్న వాటిలో నటించాలని నిర్ణయించుకున్నాను’’.
‘‘కన్నా’ అనే ఓ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో చూశాను. దానికి ఎంతో ప్రేక్షకాదరణ లభించింది. దాన్ని చూసే నేను స్ఫూర్తి పొందాను. ఇప్పటి వరకు 15 మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించాను. అయినా నాకు అవకాశాలు ఎందుకు రావడం లేదో తెలియడం లేదు. అయినా నా సినిమాకు నేను హీరోగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకంటూ నా సొంత ప్రేక్షకులు ఉన్నారు’’ అని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. దీంతో నిన్ను వాడుకుని కూడా అవకాశం ఇవ్వలేదా అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.