Aishwarya Rai : PS2 మూవీ ప్రమోషన్స్​లో మెస్మరైజ్ చేసిన మాజీ ప్రపంచ సుందరి

- Advertisement -

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఐశ్వర్యా రాయ్. ఈ భామకు నాలుగు పదుల వయసు దాటుతున్నా వన్నె మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ అందగత్తె అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఐశ్వర్యా రాయ్. ఇంతటి అందం తాజాగా భాగ్యనగరం వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్​లో పాల్గొనడానికి ఈ బ్యూటీ హైదరాబాద్ చేరింది.

Aishwarya Rai
Aishwarya Rai

ఈ ఈవెంట్​లో ఐశ్వర్య ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. మెరున్ కలర్ ఔట్​ఫిట్​లో ఐష్ చాలా అందంగా కనిపించింది. నుదట బొట్టు పెట్టుకుని పదహారణాల తెలుగు ఆడపడుచులా తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఈ ఈవెంట్​లో ఐష్ మాట్లాడుతూ హైదరాబాద్ ఫ్యాన్స్​కు నా ముద్దులు అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఐశ్వర్య కిస్ ఇవ్వడంతో అక్కడున్న ఫ్యాన్స్ అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Aishwarya Rai pramotion
Aishwarya Rai pramotion

ఐశ్వర్య తాజా ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఐష్ అందానికి మంత్ర ముగ్ధులవుతున్నారు. అందం అంటే తమకు ఐశ్వర్యాయేనని.. ఇప్పటికి ఎప్పటికీ ఈ ప్రపంచంలో అందగత్తె ఐషేనని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీకీ వయసు పెరిగినా ఈ భామ వన్నె తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ అందాన్ని చూస్తూ హాయిగా చనిపోవచ్చంటూ విరహవేదనకు గురవుతున్నారు. ఐష్ వి లవ్యూ అంటూ హార్ట్ ఎమోజీస్​ను పోస్టు చేస్తున్నారు.

- Advertisement -
Actress Aishwarya Rai
Actress Aishwarya Rai

ఇక పీఎస్2 ప్రమోషన్స్​లో భాగంగా ఐశ్వర్యా రాయ్ మాట్లాడుతూ.. ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’పై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ నెల 28న విడుదలకాబోతున్న ‘పీఎస్‌ 2’కు మీ ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నా. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన మణిరత్నంగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా సినిమాకు ఆయన్నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here