Aishwarya Rai : ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంటల లిస్ట్ తీస్తే అందులో ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ పేర్లు కచ్చితంగా ఉంటాయి. ఎన్నో ఏళ్ళ నుండి ఎలాంటి మనస్పర్థలు మరియు అపోహలు లేకుండా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న ఈ దంపతుల మధ్య గత కొంత కాలం నుండి సఖ్యత కుదరడం లేదని, ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో తరచూ గొడవలు వస్తున్నాయని బాలీవుడ్ లో ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతూ వచ్చింది.

దీనిపై అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్య రాయ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, ఇటీవల కాలం లో వీళ్ళు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడం, అలాగే అమితాబ్ బచ్చన్ మనవడు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆర్చీస్’ ప్రీమియర్ షో కి కూడా రావడం వల్ల వీళ్లిద్దరు విడిపోయారు అనే రూమర్స్ కి బ్రేక్ పడింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే ఐశ్వర్య రాయి తన కూతురు మరియు అత్తమ్మ జయా బచ్చన్ తో కలిసి ఎవరికీ తెలియకుండా దూరం గా వెళ్లిపోయిందని, ఆమె ఫోన్ కూడా కలవడం లేదని ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఐశ్వర్య రాయ్ ఎందుకు అలా వెళ్ళింది?, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏదైనా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకుందా?, లేకపోతే నిజంగానే అభిషేక్ బచ్చన్ కి దూరం గా ఉండాలని అనుకుంటుందా అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.

కానీ వీళ్ళ అభిమానులు మాత్రం ఈ వార్తలు విని చాలా హర్ట్ అవుతున్నారు. ఎంతో అన్యోయంగా కలిసి బ్రతుకుతున్న ఈ జంటపై ఎవరి చెడ్డ ద్రుష్టి పడిందో అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.