Aishwarya Rai : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ జంట. అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటే కచ్చితంగా మాకు ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి భార్య గా రావాలి అని కోరుకుంటారు. అలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఐశ్వర్య రాయ్ ని భార్య గా పొందడం నిజంగా అభిషేక్ బచ్చన్ అదృష్టం అనే చెప్పాలి. ఈ ఇద్దరు దంపతులకు ఒక పాప కూడా ఉంది.
అయితే గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో వీళ్లిద్దరు విడిపోయారు అంటూ వార్తలు ఒక రేంజ్ లో ప్రచారమైన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి అటు ఐశ్వర్య రాయ్ నుండి కానీ, ఇటు అభిషేక్ బచ్చన్ నుండి కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ, అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలను అప్లోడ్ చేస్తూ మేము కలిసే ఉంటున్నాం అని మీడియా కి అభిమానులకు హింట్ ఇస్తుంది ఐశ్వర్య రాయ్.
కానీ ఇప్పుడు ఆమె ఇంస్టాగ్రామ్ లో అభిషేక్ బచ్చన్ ని అన్ ఫాలో చెయ్యడం అనేది అందరినీ షాక్ కి గురి చేసిన విషయం. గతం లో సమంత కూడా విడాకులకు ముందు ఇలాగే చేసింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా అభిషేక్ ని అన్ ఫాలో చెయ్యడం తో ఆమె కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉందనే అభిప్రాయం కి వచ్చేసారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ సాగుతుంది.
అయితే అన్ ఫాలో అయ్యినప్పటికీ కూడా ఐశ్వర్య రాయ్ తన పేరు ఇంకా ఐశ్వర్య రాయ్ బచ్చన్ అనే ఉంచుకుంది, పేరు మార్చలేదు. దీంతో కొంతమంది విడిపోయారు అనే వార్త కేవలం రూమర్ మాత్రమే అని అనుకున్నారు. మరికొంత మంది అయితే బాలీవుడ్ హీరోయిన్స్ కి పేర్లు మార్చడం వంటి విషయాల్లో పెద్దగా పట్టింపు ఉండదు అని, ఏ సంఘటన జరగకపోతే ఐశ్వర్య రాయ్ ఎందుకు అభిషేక్ ని అన్ ఫాలో చేస్తుంది, ఎదో జరిగింది అని అంటున్నారు. దీనికి సమాధానం ఐశ్వర్య రాయ్ చెప్పాలి.