Aishwarya Rai Bachchan : విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా..?, ఆమె అందం తో ఎవరినైనా మైమరచిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ఆమెకి 50 ఏళ్ళు వచ్చాయి. ఆమె ముఖం ని చూస్తే ఎవరికైనా 50 ఏళ్ళు అని అనిపిస్తుందా?, ఆ స్థాయిలో ఆమె ఇంకా అందం ఎలా మైంటైన్ చేస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం. సినిమాల్లో అందం తో పాటుగా అద్భుతమైన అభినయం తో కెరీర్ లో దూసుకెళ్ళిన ఐశ్వర్య రాయ్, రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో మన ముందుకొచ్చి, మరోసారి తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించింది.

అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడిన తర్వాత ఆమె కొంత కాలం సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది కానీ, ఈమధ్య కాలం లో ఆమె కొన్ని సెలెక్టివ్ పాత్రలు చేస్తూ ముందుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆమెకి ఆరాధ్య అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే, ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్య రాయి మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం బ్రతుకుతున్నది ఆరాధ్య కోసమే, ఆమె నా పంచప్రాణాలు, తన రాకతో నా జీవితం లో కొత్త వెలుగులు విరబూశాయి. ఈ అనంత విశ్వం కంటే ఎక్కువగా ఆమెని నేను ప్రేమిస్తున్నాను. నా జీవితం లో అత్యంత విలువైనటువంటి నా ఆరాధ్య కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడిన ఈ ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గత కొంత కాలం లో ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరం గా ఉంటూ వస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఈ లోకం లో తనకి తన కూతురు తప్ప ఎవ్వరూ లేరు అన్నట్టుగా మాట్లాడడం ని చూస్తుంటే నిజంగానే ఆమె అభిషేక్ తో దూరంగా ఉంటుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.