Mix Up Movie : ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ సాధారణం అనే చెప్పాలి. ఇప్పుడు OTTలో తెలుగులో బోల్డ్ కంటెంట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. కానీ, ఇలాంటి బోల్డ్ సినిమా తెలుగులో అరుదనే చెప్పాలి. హాలీవుడ్, బాలీవుడ్‌లో ఇలాంటి కంటెంట్ కొత్త కాదు. సినిమా ఓరియెంటెడ్ అయినప్పటికీ సన్నివేశాలు, షూటింగ్ అన్నీ బోల్డ్ గా ఉన్నాయి. ఈ మిక్సప్ చిత్రానికి ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించాడు. ఆదర్శ్, కమల్, అక్షర గౌడ్, పూజా జయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మంచి జోడీ పాత్రల్లో ఈ నలుగురు మెప్పిస్తారని తెలుస్తోంది..

మిక్సప్ సినిమా కథ విషయానికి వస్తే..ఈ సినిమాలో ఇద్దరు జంటలు, వారికి పెళ్లి అయి ఉంటుంది. ఇద్దరికి ఆలోచనలు, కోరికలు ఒకేలా ఉంటే, మరో ఇద్దరి ఆలోచనలు వేరు. ఒక జంటలో, భార్యకు తీవ్రమైన లైంగిక కోరికలు ఉంటాయి. కానీ, భర్త ప్రేమ భావోద్వేగ బంధం. మరో జంటలో భర్తకు విపరీతమైన ప్రేమ కోరికలు ఉంటాయి. అతను తన భార్య ఇష్టంతో సంబంధం లేకుండా సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ప్రేమ మనసుకు సంబంధించినది అంటూ క్లాసులు చెబుతూ ఉంటుంది భార్య.
ఆ విధంగా రెండు జంటలు వేర్వేరు ఆలోచనలు, కోరికలు, అభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాంటి వారు విడిపోవడానికి నిపుణులను కలుస్తే.. వాళ్లు మాత్రం వీళ్లను కాస్త బ్రేక్ తీసుకుని చెప్పి.. ఇద్దరు కలవడానికి టూర్ కి వెళ్లమని సలహా ఇస్తారు. నిపుణుల మాట విన్న ఆ జంటలు అలా కలిసుందామని టూర్ కి వెళ్లిన వీరి జీవితంలోకి ఒకరి జీవితంలోకి ఇంకొకరు ఒకరు ప్రవేశిస్తారు. ఇక అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇదే మిక్సప్ కథ. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరిగే నిజ జీవితానికి సంబంధించి చాలానే పోలికలు ఉన్నాయి.
అసలు ఏం జరగుతుంది.. ఇప్పుడున్న ప్రస్తుత జంటల్లో అనేది ఈ సినిమాలో టాపిక్.. ఇందులో గట్టి మెసేజ్ కూడా ఉందనేది టాక్. మనసులోని కోరికలు.. కోసం స్వచ్ఛమైన ప్రేమను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనే నేపథ్యంలో ఈ సినిమా ఉండేలా కనిపిస్తోందనే చెప్పాలి. దీనిని ఆహా ఒరిజినల్ గా మార్చి 15 నుంచి వారి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మిక్సప్ టీజర్ వచ్చిన తర్వాత మూవీపై గట్టి అంచనాలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అవి రెట్టింపు అయ్యాయి.