లైగర్ బ్యూటీ అనన్య పాండే ఇన్ స్టా గ్రాం పోస్ట్ చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. ఏకంగా పాములతోనే ఆడుకుంటూ షాకిచ్చింది. కొండచిలువను చేతిలో తీసుకుంటూ.. స్టిల్స్ ఇచ్చింది. అనన్య పాండే పిక్స్ ని చూసి వావ్ అంటున్నారు ఫ్యాన్స్. డేరింగ్ గర్ల్ అని కామెంట్లు పెడుతూ పొగిడేస్తున్నారు ఈ బీ టౌన్ బ్యూటీని.
అనన్య పోస్ట్ చేసిన ఈ పిక్స్ కి వేలల్లో కామెంట్లు లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అనన్య పాండే తెలుగువారికి కూడా పరిచయమే. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన లైగర్ తో తెలుగు డెబ్యూ చేసింది ఈ బ్యూటీ. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
లైగర్ ఫ్లాప్ తర్వాత అనన్యకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ.. హిందీలో వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఖో గయే హమ్ కహా మూవీ రిలీజ్ కు ఉండగా..కంట్రోల్, శంకర్ సినిమాలు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.