Balakrishna : అడవి శేషు స్పై థ్రిల్లర్లతో ఆకట్టుకుంటాడు. తన క్రియేటివిటీతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఓ కార్యక్రమంలో రచయితలతో మాట్లాడిన అడవి శేషు, తాను చదువుకునే రోజుల్లో బాలకృష్ణ కారణంగా దెబ్బలు తిన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘బాలకృష్ణ కారణంగా చిన్నతనంలో మా అమ్మ నన్ను తిట్టారు. నాకు 8 సంవత్సరాలు. మేం వైజాగ్లో ఉన్నాం. స్కూల్ నుండి వస్తున్నప్పుడు, ఒక పాట విన్నాను. నాకు పాట నచ్చి, హమ్ చేయడం ప్రారంభించాను. అలానే పాడుతూ.. మా ఇంటికి వచ్చాను. మా అమ్మ నా పాట విని నా చేయి పట్టుకుంది. ప్లేట్తో నా తలపై కొట్టింది. ఆ పాట నాకు ఇప్పటికీ గుర్తుంది.
బాలకృష్ణ సినిమాలోని బీడీలు తాగండి బాబులు అనే పాట అది.’ అని అడవి శేషు గుర్తుచేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అడవి శేషు మరో పాట పాడాడట. ముద్దు పాపా హే ముద్దు పాపా.. పాడుతుండగా వాళ్ల అమ్మ విన్నారు. అది విన్న తర్వాత మరోసారి కొట్టింది. అప్పటి సినిమా పాటలు పాడటం మానేశానని అడవి శేషు చెప్పుకొచ్చాడు. ఇది విన్న సినీ ప్రియులు అడివి శేషును చిన్నప్పుడు తల్లి కొట్టడానికి బాలకృష్ణ ఇలా కారణమా అని నవ్వుకుంటున్నారు. ఇక అడవి శేషు సినిమాల విషయానికి వస్తే.. సరైన కథలను ఎంచుకుని ముందుకు వెళ్తున్నాడు. హిట్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు.
సస్పెన్స్ త్రిల్లెర్స్ కు పెట్టింది పేరుగా అడవి శేషు ఇదే తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మేజర్ సినిమా సక్సెస్ తర్వాత అడవి శేషుకి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. కానీ చాలా ప్రాజెక్టులకు నో చెప్పాడు. గూడచారి 2 సినిమా చేయాలని ఉద్దేశంతో అడవి శేషు ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఏ ప్రాజెక్టు ని కూడా ఒప్పుకోవడం లేదు. అడవి శేషు నటకు బాలీవుడ్ కూడా ఫిదా అయింది. అక్కడ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మెుదటి సినిమా నుంచి హిట్ 2 వరకూ అడవి శేషు వైవిధ్యమైన కథలతో ముందుకు వెళ్తున్నాడు. బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు. గూడచారి 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి పాన్ఇండియా సినిమాగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నాడు అడవి శేషు.