సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిని ఆదిపురుష్ మూవీ పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన తరువాత కొందరూ పాజిటివ్ అంటుంటే.. మరికొందరూ నెగిటివ్ టాక్ అని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రామాయణంలోని పాత్రల్లో శూర్ఫణఖ పాత్ర చాలా కీలకమైనది.

ఇప్పుడు అందరి దృష్టి ఆదిపురుష్ సినిమాలోని శూర్పణఖపై పడింది. రామాయణంలో శూర్పణఖ పాత్ర కీలకం. వనవాసంలో ఉన్న లక్ష్మణుడి చెంతకు చేరి మనసులో కోరిక చెప్పడం.. ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కు కత్తిరిచండం ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించింది తేజస్విని పండిట్. ఆదిపురుష్ సినిమాలో క్రూరంగా కనిపించిన ఈ బ్యూటీ మరాఠా చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. 2004లో అగా బాయి అరేచా అనే సినిమాతో మారాఠి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

మొదిటి సినిమాలోని నెగిటివ్ షేడ్స్ ఉన్న కథానాయికగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఇక తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. ఆదిపురుష్ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక ఆదిపురుష్ సినిమాలో నటించినందుకు ఆమె బాగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.