Adhi Reddy : గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి గేమ్స్ లో అద్భుతంగా రాణిస్తూ, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన వ్యక్తి ఆది రెడ్డి. నెల్లూరు జిల్లా కావలి మండలం కి చెందిన ఆది రెడ్డి జీవితాన్ని నిలిపింది బిగ్ బాస్ షో అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ ఉద్యోగం లేకుండా, ఏమి చెయ్యాలో అర్థం కాక, తనకి ఉన్న టాకింగ్ పవర్ తో ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి రివ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు.
బిగ్ బాస్ షో మీద ఆయనకీ మొదటి నుండి అమితాసక్తి ఉండేది. అందుకే బిగ్ బాస్ కి సంబంధించి ప్రతీ ఎపిసోడ్ కి రివ్యూస్ ఇవ్వడం ఆదిరెడ్డి కి బాగా అలవాటు. అలా రివ్యూస్ ద్వారానే జనాల్లో సెలబ్రిటీ గా ఎదిగిన ఆదిరెడ్డి, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆది రెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ ని నమ్ముకొని తన జీవనం ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ సీజన్ లో ఆదిరెడ్డి కేవలం శివాజీ కి ఎనలేని సపోర్ట్ ని ఇస్తూ పైడ్ పీఆర్ టీం కి ఆదిరెడ్డి హెడ్ అంటూ సోషల్ మీడియా లో ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు నెటిజెన్స్.
దీనిపై ఆగ్రహించిన ఆదిరెడ్డి, యూట్యూబ్ ఛానల్ ద్వారా తన నెల సంపాదన ఎంతో స్క్రీన్ షాట్ ని తీసి అప్లోడ్ చేసాడు. నాకు నెలకి 39 లక్షల రూపాయిల ఆదాయం కేవలం యూట్యూబ్ ఛానల్ నుండి వస్తుంది, నాకు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని సపోర్ట్ చెయ్యాల్సిన ఖర్మ ఏమిటి అంటూ ఒక వీడియో చేసాడు. ఆది రెడ్డి సంపాదన ఈ రేంజ్ లో ఉంటుందా అని ఈ స్క్రీన్ షాట్ ని చూసిన ప్రతీ ఒక్కరు నోరెళ్లబెట్టారు.