Adah sharma : సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియా లో పాజిటివ్ కామెంట్స్ ని ఎలా అయితే తీసుకోగలరో నెగటివ్ కామెంట్స్ ని కూడా అంతే సమానంగా తీసుకోవాలి.కానీ కొంతమంది సెలెబ్రిటీలు పాజిటివ్ కామెంట్స్ కి ఎన్ని సార్లు రియాక్ట్ అయ్యారో తెలీదు కానీ, నెగటివ్ కామెంట్స్ కి మాత్రం చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు.అలాంటి సెలెబ్రిటీల లిస్ట్ తీస్తే అందులో ప్రముఖ హీరోయిన్ అదా శర్మ కచ్చితంగా ఉంటుంది.
ఈమె తన ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరుచూ యాక్టీవ్ గా ఉంటుంది, హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులకు కనుల విందు పంచుతూ వస్తుంది అదా శర్మ.అయితే తన పోస్టుల క్రింద వచ్చే కామెంట్స్ కి కూడా ఆమె అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటుంది, రీసెంట్ గా ఒక అభిమాని పెట్టిన కామెంట్ కి ఆమె ఇచ్చిన రియాక్షన్ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.
అసలు విషయానికి వస్తే అదా శర్మ ఎప్పటిలాగానే తన ట్విట్టర్ అకౌంట్ లో లేటెస్ట్ ఫోటో ని ఈరోజు కూడా అప్లోడ్ చేసింది.ఈరోజు బ్లూ చీర మీద ఆమె తీసుకున్న ఫోటోకి నిమిషాల వ్యవధిలోనే వేలల్లో లైక్స్ వచ్చాయి మరియు కామెంట్స్ వచ్చాయి, ఆ కామెంట్స్ లో ఒక అభిమాని ‘మొన్న ప్రొపోజ్ చేశాను కదా..ఎప్పుడు ఎస్ చెప్తావ్ అని అడుగుతాడు..నువ్వు ఎస్ చెప్పకపోతే నేను తమన్నా ని పెళ్లి చేసేసుకుంటా’ అంటూ కామెంట్ పెడుతాడు.
ఈ కామెంట్ ని అదా శర్మ క్వాట్ చేస్తూ ‘నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను..ఆమెని సంతోషంగా ఉంచుతావని ఆశిస్తున్నాను’ అంటూ వెటకారం గా సమాధానం ఇస్తుంది..ఇది తమన్నా చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని నెటిజెన్స్ కామెంట్స్ మాట్లాడుకుంటున్నారు.