మంచు మోహన్ బాబు రెండవ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన Manchu Manoj కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇతని సినిమాలు, ఇతని సినిమాలోని పాటలకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. తన ప్రతీ చిత్రం తోను రొటీన్ కి బిన్నం గా ఉండేలాగా సినిమాలు చెయ్యడం మంచు మనోజ్ స్టైల్. అందుకే మంచు కుటుంబం లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరో అయ్యాడు.
ఇకపోతే మంచు మనోజ్ కి ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో అప్పట్లో పెళ్లి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఈ వివాహం ని ఎంతో గ్రాండ్ గా జరిపించాడు. కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత అపోహలు కారణంగా మనస్పర్థలు రావడం తో ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్ రీసెంట్ గానే భూమా మౌనిక రెడ్డి ని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు.
ఇదంతా పక్కన పెడితే మంచు మోనోజ్ మరియు మొదటి భార్య ప్రణతి రెడ్డి కి మధ్య గొడవలు రావడానికి కారణం ఒక హాట్ బ్యూటీ అని తెలుస్తుంది. ఈమె మంచు మనోజ్ తో కలిసి కేవలం ఒకే ఒక్క సినిమా లో నటించింది. కానీ ఇద్దరు ఈ సినిమా సమయం లోనే బాగా దగ్గరయ్యారు. కానీ మనోజ్ ని ఆ హీరోయిన్ ప్రేమించింది, మనోజ్ కి ప్రపోజ్ కూడా చేసింది. నాకు పెళ్లి అయ్యింది, నన్ను ఎలా ప్రేమిస్తావు, నేను నిన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశ్యం తో చూడలేదు, కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూసాను అని చెప్పాడట.
కానీ ఆ హీరోయిన్ మాత్రం నువ్వు లేకపోతే నేను ఉండలేను, నన్ను పెళ్ళి చేసుకో అంటూ మనోజ్ ని టార్చర్ పెట్టేది అట. విషయం మోహన్ బాబు దాకా వెళ్లడం తో ఆయన ఆ హీరోయిన్ ని ఇంటికి పిలిచి వార్నింగ్ ఇచ్చినా తగ్గలేదట , వేరు వేరు నంబర్స్ నుండి మనోజ్ కి ఫోన్లు తరచూ చెయ్యడం వంటివి చేసేది. ఆమె ఫోన్ కాల్స్ వల్ల ప్రణతి రెడ్డి మరియు మనోజ్ కి మధ్య గొడవలు తరచూ వస్తుండేవట. ఈ అపోహల కారణంగానే వాళ్ళు విడిపోయారని ఇండస్ట్రీ లో టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ ఏమిటి అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లాగానే ఉంది.