Chandra mohan: చంద్రమోహన్ పక్కన చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే.. ఆయన పక్కన నటించి ఓ ఊపు ఊపిన హీరోయిన్స్ వీళ్లే..!

- Advertisement -

Chandra mohan : దిగ్గజ నటుడు చంద్రమోహన్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా ఈయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 23 ఏళ్లకే రంగులరాట్నం మూవీతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు చంద్రమోహన్. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. కాగా.. ఆయన పక్కన నటించిన హీరోయిన్లందరూ స్టార్లుగా ఎదిగారు. చంద్రమోహన్ పక్కన నటిస్తే జాక్ పాట్ కొట్టినట్లే ఫీలయ్యేవాళ్లు. అందుకే ఆయన్ని లక్కీహ్యాండ్ అని పిలిచే వారు.

Chandra mohan
Chandra mohan


ఇక విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సిరిసిరి మువ్వ సినిమాతో చంద్రమోహన్ సరసన జయప్రద హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో జయప్రద ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ మూవీ హిట్ తో అప్పట్లో ఎన్టీఆర్ తో అడవి రాముడు, యమగోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.


ఇక అందాల తార శ్రీదేవి కూడా పదహారేళ్ల వయసు మూవీతో చంద్రమోహన్ పక్కన నటించి తెలుగులో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రతిఘటన సినిమాతో విజయశాంతి చంద్రమోహన్ తో నటించింది. ఆ తర్వాతే స్టార్ హీరోయిన్ గా మారింది. వీళ్లే కాకుండా జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ లాంటి వారు కూడా చంద్రమోహన్ పక్కన నటించి స్టార్లుగా ఎదికారు.

- Advertisement -
RIP Chandra mohan


మరోవైపు హీరోయిన్లే కాకుండా స్టార్ హీరోల పక్కన నటించారు చంద్రమోహన్. ఇక అప్పటి స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలా పక్కన నటించాడు. ఆ హీరోలందరూ కూడా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో తమ హవాను కొనసాగించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here