Sriya Reddy : నటి శ్రియా రెడ్డి ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె పోషించిన రాధా రమా పాత్ర ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పృథ్విరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటకు విమర్శలకు నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీతో పాటు తన తదుపరి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘సలార్’ మూవీ తన కెరీర్ కు మాంచి బూస్టింగ్ ఇచ్చిందని శ్రియా వెల్లడించింది.

సుమారు దశాబ్దం తర్వాత చేసిన ఈ సినిమా తనకు మర్చిపోలేని గుర్తింపు తెచ్చిందని చెప్పింది. ఇక తన తర్వాతి చిత్రం ‘ఓజీ’ గురించి ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తనకు కీలక పాత్ర ఉంటుందని చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించింది.
‘ఓజీ’ అద్భుతమైన చిత్రం. దర్శకుడు సుజీత్ డిఫరెంట్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ గురించి తాను ఈ సినిమాలో నటించే వరకు పెద్దగా వినలేదు. ఆయన అంత పెద్ద స్టార్ అని కూడా తెలియదు. ‘ఓజీ’లో నటిస్తున్నాని తెలియడంతో ఎక్కడికి వెళ్లినా పవన్ కల్యాణ్ అభిమానులు నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు.

మీరు మా హీరోతో నటిస్తున్నారు కదా?
అని అడుగుతున్నారు. ఆయనకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సెట్‌లో ఎప్పుడు కలిసినా చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన చాలా మంచి మనిషి. పవర్ స్టార్ తో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగం కావడం గొప్పగా ఉంది. ఈ సినిమాలో నాది నెగెటివ్ రోల్. కానీ, నా క్యారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. ప్రేక్షకులతో కలిసి తొలి రోజు సినిమా చూడాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.