Actress Sneha : మన చిన్నతనం నుండి చూస్తూ పెరిగిన చక్కటి హీరోయిన్స్ లో ఒకరు స్నేహా. సౌందర్య తర్వాత నేటి తరం లో అంత చక్కటి సంసారపక్షమైన హీరోయిన్ గా ఆమెని పరిగణించేవారు. చూపులు తిప్పుకోలేని అందం ఉన్నప్పటికీ ఆమె ఏ రోజు కూడా గ్లామర్ షో చెయ్యకపోవడం విశేషం. కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ నేడు ఇండస్ట్రీ లో ఈ స్థానం ని సంపాదించింది.

ఈమెతో పాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్ మధ్యలోనే సినిమాలను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం వాళ్లకి కేవలం అందాలు ఆరబొయ్యడం తప్ప , యాక్టింగ్ లేదు కాబట్టి. వయస్సు ఉన్నంత కాలం అందం ఉంటుంది, దాని వల్ల అవకాశాలు వస్తాయి, వయసు మీద పడిన తర్వాత కూడా హీరోయిన్స్ కి అవకాశం రావాలంటే స్నేహ కి ఉన్నంత టాలెంట్ ఉండాలి అని ఆమెని ఉదాహరణగా తీసుకొని వివరించేవాళ్ళు సినీ మేధావులు సైతం.

ఇప్పటికీ కూడా ఆమె తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఈమధ్య కాలం లో సినిమాలు బాగా తగ్గించింది. కారణం ఆమె వ్యాపార రంగం లోకి అడుగుపెట్టడమే. భర్త ప్రసన్న అనుమతితోనే ఆమె ఈ పని చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ కి గొప్ప సపోర్టు గా నిల్చిన అభిమానులకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రతీ మనిషికి ఒక డ్రీం ఉంటుంది. ఆ డ్రీం ని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.
నాకు కూడా అలాంటి డ్రీం ఉంది. ఆ డ్రీం ని నెరవేర్చున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. రీసెంట్ గానే నేను సొంత సిల్క్ స్టోర్ ‘స్నేహాలయ సిల్క్స్’ ని ప్రారంభించాను. ఎప్పటిలాగానే మీ అందరి ఆశీస్సులు కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన నాకు కావాలి’ అంటూ పోస్ట్ పెట్టింది. అభిమానులందరూ ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్ చేసారు.