తొలివలపు మూవీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ప్రియమైన నీకు చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన నటి స్నేహ. తెలుగుతనం ఉట్టిపడేలాగా ఎంతో హోమ్లీ గా ఉండే హీరోయిన్ కావడంతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ట్రెడిషనల్ లుక్ ,అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ ఎందరో అగ్ర హీరోల సరసన సినిమాలు చేసింది.
ప్రస్తుతం స్నేహ తెలుగు మరియు తమిళ్ సినిమాలలో మంచి సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తోంది. అయితే ఎంతో సంప్రదాయంగా కనిపించే స్నేహ ఒకప్పుడు భయంకరమైన రూమర్స్ ను ఫేస్ చేసింది. టాలీవుడ్ అగ్ర హీరో తో స్నేహా కి ఎఫై..*ర్ ఉంది అని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు…టాలీవుడ్ నవమన్మధుడు కింగ్ నాగార్జున.
నాగార్జున మరియు స్నేహ కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీస్ శ్రీరామదాసు మరియు రాజన్న వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్స్ జరిగే సమయంలో వర్క్ పూర్తి అయిన తర్వాత వీళ్ళిద్దరూ బయట షికారులకు వెళ్లేవారట.దీని కారణంగా అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఎఫై..*ర్ ఉన్నట్లు బాగా న్యూస్ స్ప్రెడ్ అయింది. ఎప్పుడో జరిగింది ఈ సంగతి ఇప్పుడు మళ్ళీ తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ న్యూస్ ఫేక్ అని, గ్లామర్ షోలకి ఆమడ దూరంలో ఉండే స్నేహ ఇటువంటి పనిచేస్తుంది అంటే ఎవరు నమ్మరు అని, స్నేహా లాంటి పనులు ఎప్పటికీ చేయదని.. చాలామంది స్నేహకు సపోర్ట్ చేస్తూ ఆమె తరుపున రెస్పాండ్ అవుతున్నారు. ఈ వార్తలో నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంతో మాత్రం స్నేహకు ఫ్యాన్ బేస్ గట్టిగా ఉందని అర్థం అవుతుంది.