Actress Pragathi : అరుదైన రికార్డు సాధించిన నటి ప్రగతి.. నువ్వు గ్రేట్ ఆంటీ

- Advertisement -

Actress Pragathi : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న నటీమణులలో ప్రగతి కూడా ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.. కెరీర్ లో పలు సినిమాల్లో అక్క, అమ్మ, అత్త, చెల్లెలు వంటి విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటూ స్టార్ హీరోయిన్ల రేంజ్‌లో సందడి చేస్తుంది ప్రగతి.

Actress Pragathi
Actress Pragathi

కరోనా టైంలో అనేక రకాల డ్యాన్స్ వీడియోలను షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 45 ఏళ్లు పైబడినా ప్రగతి.. జిమ్ వర్కవుట్‌లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తాను ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నిత్యం జిమ్‌లో వర్కవుట్‌లతో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. అలాంటి ప్రగతి మరో రికార్టు సాధించినట్లు దక్కినట్లు తెలుస్తోంది.

Pragathi

నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరు ఇంజినీరింగ్ కాలేజీలోని అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఉమెన్స్ నేషనల్ బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ లో ఓ ప్రొఫెషనల్ తో పోటీపడి అక్కడ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. అయితే ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించి జిమ్ వర్కవుట్‌లపైనే ప్రగతి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here