Actress Pragathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది నటీనటులు ఉన్నా వారిలో కొందరికే పాపులారిటీ వస్తుంది. కొంతమంది ఎన్ని మంచి పాత్రలు చేసినా విజయం సాధించలేరు. అయితే మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి మంచి పాపులారిటీని పొందుతున్నారు. ఈ జాబితాలో కనిపించే మొదటి పేరు నటి ప్రగతి. టాలీవుడ్ లో ప్రగతి ఆంటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం భార్యగా పలు సినిమాల్లో నటించి అందరినీ అలరించింది ఈమె.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె… తన అందాలను చూపిస్తూ అబ్బాయిలను తన బుట్టలో పడేస్తుంది. రీసెంట్ గా తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాగా పాపులర్ అయ్యింది. అంతే కాకుండా మొన్న జాతీయ స్థాయిలో అవార్డు కూడా గెలుచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ… “ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే హీరోయిన్ కావాలనుకున్నా.. కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. ఓ వ్యక్తి తల్లి పాత్రలు కాకుండా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించమని చెప్పాడు. హీరోయిన్ కాకుండా ఇలా అయితే జీవితాంతం అవకాశాలు వస్తాయని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.. అప్పటి నుంచి నేను తల్లి పాత్రలో కనిపిస్తున్నాను.. అందుకే చిన్న వయసులోనే తల్లిని అయ్యాను’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.