పవిత్ర ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ విజయనిర్మల గారి తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్… పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్… తన మూడో భార్యతో వీడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంతో సినీ వర్గాల్లో వీరిద్దరి విషయం హాట్ టాపిక్ గా నడిచింది.

ఇటీవల నరేష్, పవిత్రా లోకేశ్ హోటల్ గదిలో ఉన్నప్పుడు… ఆయన మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫుల్ గా రచ్చ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన అనంతరం జరిగిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అ అతర్వాత తాము వివాహం చేసుకున్నాం అని ప్రకటించడం.. కానీ కొన్ని రోజుల తర్వాత వారి కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. నరేష్ , పవిత్ర లోకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సినిమా “మళ్ళీ పెళ్లి”. వీరి రియల్ స్టోరీనే రీల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనలే తెరపై ప్రెజెంట్ చేస్తూ మీరు చూడక తప్పదు అనేలా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. అయితే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. యాంకర్ మీకు నిజంగా పెళ్లి అయ్యిందా అని నరేష్, పవిత్రని అడగ్గా .. అందుకు పవిత్ర నవ్వుతూ నాకు అయిపోయినట్టే ఉంది అని చెప్పడం గమనార్హం ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.