Namitha : డివోర్స్ తీసుకున్న ప్రభాస్ హీరోయిన్.. అంతా తూచ్ ఉత్తిదే

- Advertisement -

Namitha : ఒకప్పటి స్టార్ హీరోయిన నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. వాస్తవానికి నమిత సొంత ఊరు సూరత్‌. కానీ తమిళంలో అనే చిత్రాల్లో నటించి ఆఖరకు చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. ఓ సమయంలో కోలీవుడ్ హాట్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగారు. అయితే తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నమిత.. క్రమంగా ఉన్నదానికంటే ఎక్కువ బరువు పెరగడంతో క్రమక్రమంగా సినిమా ఛాన్సులు కోల్పోయింది.

సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత పలు రియాల్టీ షోలలో జడ్జిగా నమిత చేశారు. 2017లో వీరేంద్ర చెలత్రిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2022లో వీరికి కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం నమిత రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బీజేపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె ప్రచారం చేశారు. అయితే విభేదాల కారణంగా నమిత, వీరేంద్ర డివోర్స్ తీసుకుని విడిపోయారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విడాకుల రూమర్స్‌పై ఇటీవల నమిత స్పందించారు.

- Advertisement -

 

నా భర్తతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసినా డివోర్స్ రూమర్స్ రావడం బాధాకరమని నమిత పేర్కొన్నారు. ‘మా విడాకుల పుకార్లు రాకముందే.. నా భర్తతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ మేం డివోర్స్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నటిగా నేను చాలా రూమర్స్‌ను ఎదుర్కొన్నాను. ఈ విడాకుల రూమర్‌ను నేను, నా భర్త సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వార్తలు చూసి మేం నవ్వుకున్నాం’ అంటూ నమిత స్పష్టం చేశారు. తెలుగులో నమిత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిల్లా, సింహ లాంటి హిట్ సినిమాల్లో నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here