కుక్కలు కూడా అలా చెయ్యవు.. కొంచెం కూడా సిగ్గులేదా.. ఎమ్మెల్యే బంధువుపై నటి కస్తూరి ఫైర్..

- Advertisement -

నటి కస్తూరి గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సీరియల్స్ తో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. తనకు సంబంధం లేని విషయాల గురించి కూడా ఆమె మాట్లాడుతూ వస్తుంది..తాజాగా ఓ ఎమ్మెల్యే బంధువు చేసిన పనిపై తెగ ఫైర్ అయింది కస్తూరి. ఈ విషయం సీఎం వరకు వెళ్లడం విశేషంగా మారింది. సోషల్ మీడియాలో జూలై 5న ఓ వీడియో కలకలం సృష్టించింది. అమానవీయ చర్యకు సంబంధించిన ఈ వీడియో వైరల్ కాగా అది చూసిన ప్రతి ఒక్కరు కోపంగా రగిలిపోయేలా ఉంది.

నటి కస్తూరి
నటి కస్తూరి

మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్ కాలుస్తున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి చేసిన పనికి అందరూ మండిపడుతున్నారు. మద్యం మత్తులో రోడ్డు పక్కన మెట్లపై కూర్చున్న ఒక యువకుడిపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేశాడు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట ఓ రేంజు లో వైరల్ అవుతుంది.. ప్రవేశ్ శుక్లా అలా మూత్ర విసర్జన చేయడంతో ఆ యువకుడు ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించాడు.

నటి కస్తూరి

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సిధ్ జిల్లాలో చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కస్తూరి కూడా రెచ్చిపోయింది.కుక్కలు కూడా అలా చేయాలనుకోవు. ఆ సిక్కో అయినా ప్రవేశ్ శుక్లా మధ్యప్రదేశ్ లోని బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు సన్నిహితుడని అంటున్నారు. నిర్ణయాత్మకంగా తక్షణమే శిక్షిస్తారా లేదా విషయాన్ని వదిలేస్తారా? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన, తమిళనాడు బీజేపీ లీడర్ చేసిన మరొక ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నానని వీడియో షేర్ చేస్తు రాసుకొచ్చింది కస్తూరి శంకర్.

- Advertisement -

కస్తూరి శంకర్ ట్వీట్ చేసిన కొద్ది సమయానికే మధ్యప్రదేశ్ పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కస్తూరి రీట్వీట్ చేశారు. వావ్ క్విక్ రియాక్షన్. ఈ విషయం గురించి ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుసుకున్నారు అని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.. మత్తానికి ఈ వార్తతో మరోసారి ఈమె వార్తల్లో నిలిచింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com