Actress Karthika : “రంగం” ఫేమ్ కార్తిక నాయర్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఆమె పోస్ట్ పెట్టారు. స్టార్ హీరోయిన్ రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఫస్ట్ మూవీతోనే ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న బ్యూటీ కార్తిక. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లిపీటలెక్కనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

గత నెలలో ఎంగేజ్‌మెంట్ పిక్ షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఆమె.. తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మీనన్ ను పరిచయం చేసింది. అతడితో స్మైల్ ఇస్తూ దిగిన పిక్ ను షేర్ చేసింది. నిన్ను కలవడం విధి.. నిన్ను ఇష్టపడటం ఓ మ్యాజిక్.. మన లైఫ్ స్టార్ చేసేందుకు కౌంట్ డౌన్ స్టార్ చేశా.. అని ఆమె రాసుకొచ్చారు. ప్రెజెంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాబోయే కపుల్ కి అందరూ విషెస్ చెప్తున్నారు. 2009లో జోష్ మూవీతో కార్తిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2011లో విడుదలైన ‘రంగం మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి మూవీల్లో కీ రోల్ ప్లే చేసింది. 2015 నుంచి కార్తిక బిగ్ స్ర్కీన్ కు దూరంగా ఉంది.