Actress Karthika : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియా లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రాధ. సుమారుగా దశాబ్దం కాలం పాటు ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించింది. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ లో కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది కార్తీక. 2009 వ సంవత్సరం లో నాగార్జున పెద్ద తనయుడు నాగచైతన్య హీరో గా నటించిన తొలిసినిమా ‘జోష్’ చిత్రం తో ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దీంతో ఈమె తమిళ ఇండస్ట్రీ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వాటిల్లో ‘రంగం’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగు లో ‘దమ్ము’ చిత్రం చేసింది. ఇది కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత 2015 వ సంవత్సరం లో అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ చిత్రం లో హీరోయిన్ గా నటించి సినిమాలకు దూరం అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా చురుగ్గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమె తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. గత కొంతకాలం నుండి ప్రముఖ యంగ్ హీరోతో కార్తీక డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి.

నిన్న ఆమె ఒక అతనిని కౌగలించుకొని ఫోటో దిగడం, ఆ ఫొటోలో ఆమె చేతికి ఉంగరం కనిపించింది. ఇదంతా చూస్తుంటే ఆమెకి నిశ్చితార్థం జరిగిపోయింది అనే విషయం తెలుస్తుంది. వరుడు ఎవరో ఆ ఫొటోలో రివీల్ చెయ్యలేదు. కుటంబ సభ్యులు కూడా ఈ నిశ్చితార్థం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. మరి ఈ ఫోటో వెనుక ఉన్న సారాంశం ఏమిటో కార్తీకనే క్లారిటీ ఇవ్వాలి.