Kajal : సైలెంట్ గా రెండవ పెళ్లి చేసుకున్న కాజల్.. సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న ఫోటోలు!

- Advertisement -

Kajal : కాజల్ కి రెండవ పెళ్లి అనే హెడ్ లైన్ చూడగానే మీ అందరికి మైండ్ బ్లాక్ అయ్యుంటుంది కదా?, కాజల్ అగర్వాల్ లక్షణంగా తన భర్త పిల్లలతో సంతోషం గా ఉంటూ ప్రతీరోజు ఫోటోలను కూడా షేర్ చేస్తుంటే, ఇలా రెండవ పెళ్లి అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ కాజల్ అంటే కాజల్ అగర్వాల్ కాదు, తమిళం లో కాజల్ పేరిట ఒక యంగ్ హీరోయిన్ కూడా ఉంది.

Kajal
Kajal

ఈమె 2008 వ సంవత్సరం లో శాండీ మాస్టర్ అనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ని ప్రేమించి పెళ్లాడింది. శాండీ మాస్టర్ అంటే లియో చిత్రంలో కనిపించే సైకో కిల్లర్ గుర్తు ఉన్నాడు కదా ?, అతనే. కొంతకాలం అతనితో దాంపత్య జీవితం గడిపిన తర్వాత కొన్ని విబేధాల కారణంగా 2012 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శాండీ మాస్టర్ రెండవ పెళ్లి చేసుకున్నాడు కానీ, కాజల్ మాత్రం చేసుకోలేదు.

Actress Kajal

అయితే ఇన్ని రోజులకు ఆమె నేను రెండవ పెళ్లి చేసుకున్నాను అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. పెళ్లి బట్టలతో ఉన్న ఫోటో ని అప్లోడ్ చేస్తూ ‘మొత్తానికి రెండవ పెళ్లి చేసుకున్నాను, నన్ను క్షమించండి ఫ్రెండ్స్, మీరంతా సంతోషంగా , క్షేమంగా ఉన్నారనే నేను ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కేవలం ఆమె పెళ్లి బట్టలు ఉన్న ఫోటోని మాత్రమే షేర్ చేసింది కానీ, పెళ్లి కొడుకు ముఖాన్ని మాత్రం చూపించలేదు.

- Advertisement -
Tamil Actress Kajal

ఇక ఆమె అభిమానులు అయితే ఈమె నిజంగానే పెళ్లి చేసుకుండా, లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేస్తుందా అనే డైలమా లో పడ్డారు. ఇకపోతే కాజల్ గతం లో అల్లు శిరీష్ హీరో గా నటించిన గౌరవం చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here