Jyotirai : తన గొప్ప మనసు చాటుకున్న జగతి ఆంటీ.. మొగిలయ్యను సాయం వీడియో వైరల్

- Advertisement -

Jyotirai : ‘గుప్పెడంత మనసు’లో జగతి మేడమ్‌గా బాగా పాపులర్ అయింది జ్యోతి రాయ్. ఆమె కన్నడలో ఎన్నో సీరియల్స్ చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో జగతి మేడమ్‌గా ఫుల్ క్రేజ్‌ దక్కించుకుంది. ఇందులో సంప్రదాయంగా కట్టు, బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో మోడ్రన్ డ్రెస్సులు ధరించి తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అక్కడ ఆమె ఎంతో బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఓ నెటిజన్ ఆమె అశ్లీల వీడియోలను బయటపెడతానంటూ.. కొన్ని స్క్రీన్ షాట్స్‌ను పోస్ట్ చేశాడని ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. జ్యోతి రాయ్ గొప్ప మనస్సు చాటుకుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయకుండా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేసింది. తన వంతు సాయంగా ఆయనకు రూ. 50 వేలు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ నేను ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ నా కష్టాల కంటే మొగిలయ్య ఇబ్బందులు నన్ను కలచివేశాయి. అందుకే ఆయనకు సహాయం చేశాను. మొగిలయ్య ప్రతిభకు నేను చేసే సాయం పెద్దది కాదు. కాబట్టి ఆయనను ఆదుకోవడానికి ఎంతో మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది.

- Advertisement -

దీంతో అది చూసిన నెటిజన్లు జ్యోతిరాయ్‌ను మెచ్చుకుంటూ ప్రశంసలతో కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు. కాగా.. మొగిలయ్య గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఓ నిర్మాణ సంస్థలో కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here