Jyothi Rai : నటిగా వచ్చి డైరెక్టర్ బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్న హాట్ యాక్టర్.. ఎవరంటే ?

- Advertisement -

Jyothi Rai : జ్యోతిరాయ్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుప్పెడంత మనస్సు సీరియల్లో జగతి మేడంగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో కూడిన సూప‌ర్ హీరో మూవీగా ఏ మాస్టర్ పీస్ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. తాజాగా సినిమాకు సంబంధించిన టీజ‌ర్ విడుదలైంది. అందులోని విజువ‌ల్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి.

సుకు పూర్వాజ్ అంతకు ముందు ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతితో పాటు మనీష్ గిలాడ, అరవింద కృష్ణ, అషు రెడ్డి కీలక పాత్రలను పోషించారు. త్వరలో ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. తాజాగా హైదరాబాద్‌లో ‘ఏ మాస్టర్ పీస్’ టీజర్ విడుదల ఈవెంట్‌ను గ్రాండ్‌ను సెలబ్రేట్ చేశారు చిత్ర యూనిట్.

- Advertisement -

ఈ సందర్భంగా జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. ‘బుల్లితెరపై నేను మీ అందరికి పరిచయమే. ఇప్పుడు ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అడుగుపెడుతున్నాను. ఈ టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీ షూటింగ్‌లో నా పర్సనల్ లైఫ్‌లో ఒక మూమెంట్ జరిగింది. నేను డైరెక్టర్ సుకు పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయింది. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్న’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బండి ప్రొడక్షన్స్ పతాకంపై.. శ్రీకాంత్ కండ్రేగుల నిర్మించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here