Hema : హేమకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా ?

- Advertisement -

Hema : ఇప్పుడు టీవీలో ఏ న్యూస్ ఛానెల్ పెట్టినా బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలే. దాంతో పాటు సోషల్ మీడియాలో ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. వారిలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దాంతో పాటు పోలీసులు వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలను బయటపెట్టారు.

దీంతో హేమకు సంబంధించిన పలు పాత ఇంటర్వ్యూలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన హేమ.. తన ఆస్తుల వివరాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన హేమ చాలా లగ్జరీ లైఫ్‌ని గడుపుతుంది. ఇదంతా సినిమాల వల్లేనా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. నేను కేవలం సినిమాల పైనే ఆధారపడి ఉండుంటే తన లైఫ్ మరోలా ఉండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

‘‘నా భర్త కెమెరా మ్యాన్, మా అమ్మ వాళ్లు కూడా బాగా ఉన్న వాళ్లే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒంటినిండా నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఊరిలో కూడా మాకేం సంపదకు లోటు లేదు. కిట్టీ పార్టీలతో కూడా బాగానే సంపాదిస్తున్నాను. కేవలం ఇండస్ట్రీ పైనే ఆధారపడి సంపాదించడం కష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది హేమ. కాకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా తనకు రూ.150, రూ.200 కోట్ల ఆస్తులు లేమీ లేవని.. ఉన్నదాంట్లో మాత్రం హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది . అంత ఆస్తి ఉంది కాబట్టే.. బెంగళూరు రేవ్ పార్టీ ఎంట్రీ కోసమే ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వగలిగిందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here