Bhumika Chawla : ఇండస్ట్రీకి వచ్చాక రెండో సినిమాగా పవన్‌తో ‘ఖుషీ’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా భూమికకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘వాసు’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారింది. దాదాపు దశాబ్ద కాలం పాటు దక్షిణాదిన తెగ బిజీగా గడిపింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ భూమిక వరుస సినిమాలతో చెలరేగిపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా భూమిక కీలకపాత్రలో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. ఈ అమ్మడు తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.

‘తేరే నామ్’ తర్వాత దాదాపు 20ఏళ్లకు సల్మాన్, భూమిక చావ్లా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాతో భూమికకు హిందీలో తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఆమెకు అవకాశాలు కూడా భారీగా వచ్చాయి. కాగా తాజాగా ఈ అమ్మడు ఆమె సంతకం చేసిన సినిమాల నుంచి కూడా తనను తీసేసారని సంచలన విషయాలను చెప్పుకొచ్చింది.
షాహిద్ కపూర్, కరీనా కపూర్‌ల ‘జబ్ వీ మెట్’ సినిమాలో ముందుగా తననే ఎంపిక చేశారని భూమిక చెప్పింది. ముందుగా ఈ సినిమాకు ట్రైన్ అనే టైటిల్‌ను పెట్టారని, హీరోగా బాబీ డియోల్‌ను అనుకున్నారని చెప్పింది. అయితే నిర్మాణ సంస్థ మారడంతో ఆ ప్రాజెక్ట్‌లోకి కరీనా కపూర్, షాహిద్ కపూర్ వచ్చారని చెప్పింది. అప్పుడు తనకు చాలా బాధగా అని బాధపడింది.

ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. ఆ సినిమా కోసం నేను ఏకంగా ఏడాదిపాటు వేచి చూశాను. ఏ ఇతర ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు. ఆ తర్వాత నేను మరో ప్రాజెక్ట్‌కు సంతకం చేశాను కానీ అది పట్టాలెక్కలేదు. ‘తేరేనామ్’ తర్వాత నా సినిమాలేమీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయాయి. సినిమా పరిశ్రమ ఒక జూదం లాంటింది. ఇక్కడ ఎప్పుడు ఏ సినిమా విజయం అందుకుంటుంది అనేది చెప్పడం కష్టం అని భూమిక వెల్లడించారు. దరించకపోయినా తెలుగు వాళ్లు మాత్రం తెగ హిట్లు ఇచ్చారు.