ఇటీవల ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ళు, డేటింగ్ లు, విడాకులు సాధారణమైపోయాయి. గోడకు కొట్టిన బంతిలా ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో.. కొంతమంది అంతే త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. మరి కొంత మంది కొన్నేళ్లు కలిసి జీవించిన తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరోయిన్ ఆసిన్ కూడా ఆ జాబితాలో చేరిపోనుందని సమాచారం. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వనున్నట్లు సినీ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు ఆమెను వరించాయి. అంతే కాకుండా అసిన్ సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. నాగార్జునతో ‘శివమణి’, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్ సరసన ఘర్షణ సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్ తో అన్నవరం, ప్రభాస్ తో చక్ర వంటి సినిమాలు ఆమెను నిరాశ పరిచాయి. అసిన్ తమిళంలో గజినీతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే 2016లో ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది.
పెళ్లయ్యాక చాలా కాలంగా సంతోషంగా ఉన్న ఈ జంట మధ్యలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయట. అందుకే త్వరలో అసిన్, రాహుల్ శర్మలు విడాకులు తీసుకోబోతున్నారు. అసిన్ భర్త రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈవోగా పనిచేశారు. రాహుల్ కొన్నాళ్లుగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని టాక్. అది తెలిసి అసిన్ అతడిని రెండు సార్లు హెచ్చరించిందట. అయినా భర్త వినకపోవడంతో అసిన్ దూరంగా ఉంటోంది. అయితే అసిన్కి పాప కూడా ఉంది. భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న సంగతి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.