Actress : ప్రతీ ఇండస్ట్రీలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఉంటాయి. కానీ సినిమా పరిశ్రమలో వీటిపై ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. జనాలు అంతా కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్‌తో చూసేది సినిమాలే కాబట్టి.. హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాల మీద జనాలు ఫోకస్ పెడుతుంటారు. ఇక ఇక్కడి మీటూ, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. చిన్మయి, తను శ్రీ దత్తా వంటి వారు క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాన్ని బాగానే నడిపించారు. చిన్మయి అయితే ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. తాజాగా హిందీ నటి అంకితా లోఖండే సౌత్ ప్రొడ్యూసర్ మీద చేసిన కామెంట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సినిమా హీరోయిన్ ఆఫర్ అంటూ.. పడుకుంటేనే ఇస్తామని, కాంప్రమైజ్ కావాలని అన్నాడట. నాటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనను అంకిత రీసెంట్‌గా బయటపెట్టేసింది. ఇదంతా కూడా తనకు 19 ఏళ్లు ఉన్న టైంలో జరిగిందట. ఆ టైంలో తనకు హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేదట. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలకు ఆడిషన్ ఇచ్చిందట. ఓ సారి సౌత్ సినిమాకు హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యావని కాల్ వచ్చిందట. సైన్ చేయడానికి రమ్మని పిలిచారట. అంత సులభంగా ఎలా అవుతుందని అనుకుని.. తన అసిస్టెంట్‌ను వెంట పెట్టుకుని ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్‌కు వెళ్లిందట.
తనని ఒక్క దాన్ని మాత్రమే లోపలకు పిలిచారట. సినిమాలో హీరోయిన్ అవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాలని అన్నారట. కాంప్రమైజ్ అంటే ఏంటో ఆ వయసులో తెలియక అంటే ఏంటి? అని అమాయకంగా అడిగేసిందట. నిర్మాతతో పడుకోవాలి.. అప్పుడే హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తామన్నారట. దీంతో నేను అలాంటి టైపు అమ్మాయిని కాదు అని చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వచ్చేసిందట. ప్రస్తుతం అంకిత చెప్పిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.