Ananya Nagalla : సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో చిక్కిన స్టార్ హీరోయిన్.. భలే తెలివిగా తప్పించుకుంది

Ananya Nagalla : ఇటీవల కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. కేటుగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో జనాలను మోసం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు జనాలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అసలు మోసం ఇలా కూడా చేస్తారా ? అన్న స్థాయిలో దుండగుల నేరాలకు పాల్పడుతున్నారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మభ్యపెట్టి దోచేసుకుంటున్నారు. చదువుకోని వారినే కాదు.. ఉన్నత స్థాయి చదువులు చదివిన వారు కూడా వారి బారిన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడిన పలువురు సెలబ్రెటీలు, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా తమకు జరిగిన మోసాలను తెలియజేశారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. మూడ్రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని తనకు కాల్ చేసి భయపెట్టారని.. డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

“నా ఆధార్ కార్డ్ ఉపయోగించి ఒక సిమ్ తీసుకుని దాని నుంచి చాలా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అంటే సరే అన్నాను. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయమంటూ అంటూ స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయమంటే చేశాను. వారిని చూస్తే నిజంగానే పోలీసు డ్రెస్ వేసుకుని కనిపించారు. నా సిమ్ పేరుతో మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులు ఉన్నాయంటూ భయపెట్టారు. ఆ తర్వాత పది నిమిషాలకు వీడియో కాల్ కట్ చేశారు. ఎంత కమిషన్ తీసుకున్నావు.. కేసు ఫైల్ చేస్తున్నాం.. జైల్లో వేస్తాం అంటూ భయపెట్టారు. వాళ్లు పంపిన డాక్యూమెంట్స్ కూడా నాకు అఫీషియల్ గా కనిపించాయి.

అకౌంట్స్ ఎన్ని వాడుతున్నారు అంటే రెండు అని చెప్పాను. కేసు నుంచి బయటపడాలంటే కొంత అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయాలని అడుగుతూ థర్ట్ పార్టీ అకౌంట్ నంబర్ పంపించారు.దీంతో నాకు డౌట్ వచ్చి క్వశ్చన్ చేస్తుంటే సరిగ్గా స్పందించలేదు. వెంటనే గూగుల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది. వారిపై గట్టిగా అరిస్తే నా మీద అరిచారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే వెంటనే కాల్ కట్ చేశారు. ఇలా వారు చాలా మందిని బెదిరిస్తున్నారని తెలిసింది. అమ్మాయలను టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి” అంటూ అనన్య నాగళ్ల వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here