Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, తల్లి సోనీ ఓ స్కామ్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఓ సంచలనాత్మక పోస్ట్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా తనకు కూడా అలాంటి కాల్ వచ్చిందని.. చాలా భయమేస్తున్నట్లు తెలిపింది. కాబట్టి ఎవరికి అలాంటి కాల్స్ వచ్చిన జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించింది. ఇంతకీ అసలు ఆమె చేసిన పోస్టులో ఏమి ఉందంటే.. ‘‘ ప్రతి ఒక్కరి చుట్టూ భారీ స్కామ్ జరుగుతోంది. ఎవరో ఢిల్లీ కస్టమ్స్ నుండి ఫోన్ చేసి.. మీరు కొన్ని చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఆర్డర్ చేశారని చెప్పారు. అలాగే వారు పోలీసుల నుంచి వచ్చినవారమని చెప్పి మీ నుండి మీ ఆధార్ కార్డ్ నంబర్ అడిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు.
అప్పుడు వారు మిమ్మల్ని భయపెడతారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు మీరు వారికి పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనోవేదనకు గురైతే నిద్ర కరువు అవుతుంది. నాకు అలాంటి కాల్ వచ్చింది. అదృష్టవశాత్తూ నేను వారికి ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకున్నాను. కాల్ చేస్తామని చెప్పారు. వారు ఆధార్ నంబర్‌ని అడిగిన వెంటనే నేను వారికి తర్వాత చెబుతానని చెప్పి కట్ చేశాను. వారు తిరిగి కాల్ చేయలేదు. కానీ భయంగా ఉంది. మీకు కూడా ఇలాంటి ఘటనే జరిగితే.. కాల్స్ వచ్చిన నంబర్‌లను సేవ్ చేసి పోలీసుల దగ్గరకు వెళ్లండి. గత కొన్ని వారాల్లో ముగ్గురు వ్యక్తులకు ఇలాంటి కాల్స్ వచ్చినట్లు నాకు తెలిసింది’’ అని రాసుకొచ్చింది.
అలాగే.. మీకు ఈ రకమైన కాల్ వచ్చినప్పుడు అది నిజమైన కాల్ అని భావించినప్పుడు ఆందోళన సర్వసాధారణం. నేను ఇతరులతో మాట్లాడినప్పుడు ఈ విషయం చెబితే పట్టించుకోవద్దని చెప్పారు. కానీ కొన్నిసార్లు మీ తప్పు కాకపోయినా మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక పెద్ద స్కామ్’’ అని క్యాప్షన్ జత చేసి పోలీసులను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం అలియా తల్లి పెట్టిన పోస్టు వైరల్ కావడంతో అవి చూసిన వారంతా మా కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయంటూ కామెంట్ల రూపంలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram