Actress Aamani : జంబలకడిపంబ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆమని.. ఈవీవీ సత్యనారాయణ లాంటి గొప్ప డైరెక్టర్ ద్వారా ఆమె టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అంతేకాదు మొదటి సినిమాతోనే మగరాయుడు లాంటి క్యారెక్టర్ చేసి మగవాళ్లపై ఆడవాళ్లదే పై చేయి ఉండాలని భావించే మనస్తత్వం ఉన్న అమ్మాయిలాగా అద్భుతంగా నటించారు ఆమని..
ఆ సినిమాలో హీరో నరేష్ ను పెళ్లాడిన తర్వాత ఒక పాట మొదట్లో బీర్ బాటిల్ మూత స్టైల్ గా ఓపెన్ చేసి పొంగుతున్న బీరు సీసాను నోట్లో పెట్టుకుంటారు ఆమని. ఆ సీన్ ఆమె రియల్ గా చేశారట. ఆమెకు రియల్ బీరే ఇచ్చారట. ఈ విషయాన్ని ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇందులో మందు కొట్టే సీన్ ఉందని.. సిగరెట్ కాల్చే సీన్ ఉందని డైరెక్టర్ నాకు ముందు చెప్పలేదు. షూటింగ్ స్పాటు కు వెళ్ళినప్పుడు ఏ అమ్మాయి ఈరోజు మందు కొట్టే సీన్ ఉంది అన్నారు. నరేష్ కూడా ఏం పర్లేదు చేయమని ఎంకరేజ్ చేశారు అని చెప్పింది ఆమని. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన ఆమని.
మా సినిమా డిస్ట్రిబ్యూటర్. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించాలని ఆసక్తి . అది చూసి మా నాన్న నటించడానికి ఒప్పుకున్నారు. తమిళ సినిమాతో నా కెరీర్ మొదలైంది. అవకాశాల కోసం రెండు సంవత్సరాలు పైగా కష్టపడ్డాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కొందరు అవకాశాలు ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండాలని పరోక్షంగా అనేవారు .ఒంటరిగా కలవమనేవారు. అమ్మ చొరవతో వాటన్నింటినీ తిరస్కరించా.. కొంతకాలానికి వాళ్ల మాటల లోని అర్థాలు తెలుసుకున్నాను.
అప్పుడు చాలా బాధపడ్డాను. నాన్న చెప్పినా వినకుండా తప్పుడు మార్గంలోకి వచ్చేసానా అని అనిపించింది. ఇండస్ట్రీలో అందరూ అలా ఉండరు. కొందరికే అలాంటి దుర్బుద్ధి ఉంటుంది. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్న కొన్ని రోజులకే తెలుగులో జంబలకడిపంబ లో ఆఫర్ వచ్చింది. అదే నా తొలి సినిమా.. అక్కడి నుంచి నా కెరియర్ మారిపోయింది. నటిగా దారిలో పడ్డాను. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారాను అని ఆమని చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా చిరంజీవి పక్కన నటించినందుకు బాధగా ఉందని.. ఆయనకు నేను వీరాభిమాని అని ఆమని తెలిపారు. కాస్టింగ్ కౌచ్ పై ఆమని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.