Actor Srikanth : ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి స్టార్ హీరో గా ఎదిగిన అతి తక్కువ మందిలో ఒకరు శ్రీకాంత్. కుటుంబ కథా చిత్రాలు,లవ్ స్టోరీస్ తో ఒకానొక సమయం లో లేడీస్, యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఏ హీరో కి అయినా ఫ్లాప్స్, డిజాస్టర్స్ సహజం. కానీ ఒక పద్ధతి ప్రకారం స్క్రిప్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని, కెరీర్ లో దూసుకెళ్తారు. కానీ శ్రీకాంత్ ఆ విషయం లో విఫలం అయ్యాడు. ఫలితంగా ఆయనకి హీరో గా మార్కెట్ పూర్తిగా పోయింది. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు పోషిస్తూ, పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదంతా మనకి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలు పోషించిన దేవర, గేమ్ చేంజర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు, ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా శ్రీకాంత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలను మీడియా తో పంచుకున్నాడు. ఒకానొక సమయంలో శ్రీకాంత్, అలీ కలిసి మాదాపూర్ లో ఒక చెరో రెండు ఎకరాలు ఫ్లాట్స్ కొనడానికి వెళ్లారట. రెండు ఎకరాలు ఆ రోజుల్లో 20 లక్షల రూపాయిల వరకు ఉండేదట.
మన అందరికీ తెలిసిందే కదా, అప్పట్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలు అడవులు లాగ ఉండేవి. హైదరాబాద్ ఇంకా వృద్ధి చెందని రోజులవి. ఆ సమయంలో ఇంత రేట్స్ పెట్టి కొనడానికి మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరైనా కొంటారా వీటిని అని అలీ, శ్రీకాంత్ తో వచ్చిన కార్ డ్రైవర్ అన్నాడట. అతని మాటలకు ప్రభావితమైన ఈ ఇద్దరు, నిజమే కదా ఇంత డబ్బులు పెట్టి ఇలాంటి ప్రాంతాల్లో రిస్క్ చెయ్యడం ఎందుకు అని వెనుతిరిగారట. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఒక్కో ఎకరా 80 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. అలా ఒక డ్రైవర్ మాటలకు ప్రభావితమై శ్రీకాంత్, అలీ వందల కోట్లు నష్టపోయారట.