Rajasekhar : అమ్మాయి మీద మోజుతో మందు తాగి గుడిలోకి అడుగుపెట్టిన హీరో రాజశేఖర్.. తర్వాత ఏమైందంటే!

- Advertisement -

Rajasekhar : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తెలుగు రాకపోయినా కూడా పెద్ద స్టార్ గా, యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న నటుడు రాజశేఖర్. డాక్టర్ వృత్తి నుండి సినీ ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు, పోలీసులకు సంబంధించిన సినిమాలే చేస్తూ ఉండడం వల్ల రాజశేఖర్ కి అప్పట్లో మాస్ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉండేది.

అలాగే కొన్ని కుటుంబ కథ చిత్రాలు చెయ్యడం వల్ల ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఇమేజ్ ఏర్పడింది. హిట్లు, బ్లాక్ బస్టర్స్ తో సుమారుగా మూడు దశాబ్దాలు కెరీర్ ని కొనసాగించిన రాజశేఖర్ కి ప్రస్తుతం మార్కెట్ లేకపోవడం బాధాకరం. అయితే త్వరలోనే ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారబోతున్నాడు. రీసెంట్ గానే నితిన్ హీరో గా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డనరీ మెన్’ చిత్రం లో చిన్న పాత్ర చేసాడు.

Rajasekhar
Rajasekhar

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాజశేఖర్ అప్పట్లో తనకి జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో నాకు దేవుడి మీద అసలు నమ్మకం ఉండేది కాదు, కానీ నా జీవితం లో జరిగిన ఒక సంఘటన కారణంగా దేవుడి మీద ఎనలేని నమ్మకం , భక్తి ఏర్పడింది. అప్పట్లో నేను ఒక అమ్మాయిని ఘాడంగా ప్రేమించాను.

- Advertisement -

ఒకరోజు ఆ అమ్మాయి వద్దకి వెళ్లి నా ప్రేమని వ్యక్తపరిచాను. కానీ ఆ అమ్మాయి మాత్రం నా ప్రేమని రిజెక్ట్ చేసింది. అంతే దెబ్బకి దేవదాసుని అయ్యాను, ప్రతీ రోజు ఇష్టమొచ్చినట్టు తాగేసేవాడిని. అలా నా తాగుబోతు అవతారం చూసి నా స్నేహితుడు ఇప్పటికైనా దేవుడిని నమ్మురా, అన్నీ మంచే జరుగుతుంది అన్నాడు. ఆరోజు ఫుల్లుగా తాగేసి ఉన్నాను, మా ఇంటి పక్కనే ఉన్న శివాలయం కి వెళ్ళాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Actor Rajasekhar

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘శివాలయం కి వెళ్లిన తర్వాత దేవుడికి నా మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పేసాను. ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి, మా ఇద్దరినీ నువ్వే కలపాలి, అది జరగకపోతే నిన్ను నేను ఒక రాయి లాగానే భావిస్తా అని మనసులో దేవుడిని కోరుకున్నాను. కట్ చేస్తే ఆరు నెలల్లో ఆ అమ్మాయే నా వద్దకి వచ్చి ఐ లవ్ యు అని చెప్పింది. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు, జీవితనే’ అని చెప్పుకొచ్చాడు రాజశేఖర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here