Nani : నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ‘దసరా’తో అందుకున్న నాని మరో రెండు రోజుల్లో ‘హాయ్ నాన్న’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ‘దసరా’ మూవీతో శ్రీకాంత్ ఓదెలాని పరిచయం చేసిన నాని ఇప్పుడు ‘హాయ్ నాన్న’తో శౌర్యువ్ అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుతున్నాయి. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నాని ట్విట్టర్ వేదికగా ఆస్క్ నాని(#Ask Nani) అనే సెషన్ ని నిర్వహించాడు. ఇందులో అభిమానులు, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. సుమారు గంటపాటు సాగిన ఈ సెషన్ లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాని ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

‘హాయ్ నాన్న’ మూవీతో శౌర్యవ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అయితే కొత్త డైరెక్టర్లలో మీరు ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు?’ అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాని రిప్లై ఇస్తూ.. “బలగం డైరెక్టర్ వేణుతో సినిమా చేయాలని అనుకుంటున్నా” అని తెలిపాడు. ఈ నేపథ్యంలో నానితో త్వరలో మంచి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని అభిమానులు అనుకుంటున్నారు.