Hi Nanna : ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని అంతకు మించిన పెద్ద ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తాడు అనుకుంటే , ఒక సింపుల్ కథ తో మన ముందుకు ‘హాయ్ నాన్న’ సినిమా తో డిసెంబర్ 7 వ తారీఖున రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో నాని మన ముందుకు రాబోతున్నాడు అనేది అందరికీ అర్థం అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని నాని చాలా విన్నూతన రీతిలో ప్లాన్ చేసాడు. తెలంగాణ ఎన్నికలను తన సినిమా ప్రొమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు ఆయన సీఎం కేసీఆర్ లాగ, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ బాగా హైలైట్ అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని కొంత మంది మీడియా మిత్రులు మరియు సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా ప్రసాద్స్ ల్యాబ్స్ లో షో వేసి చూపించారట . ఈ షో కి వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవ్వరు చూడని కాన్సెప్ట్ తో చాలా చక్కగా, ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా డైరెక్టర్ శౌరవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అని.

సరిగ్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే మాత్రం ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్తుందని, పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము లేపేస్తుంది అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారట. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తన కూతురు భవిష్యత్తు నుండి గతం లోకి వస్తే ఎలా ఉంటుంది అనే కథాంశం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. మరి ప్రివ్యూ షో లో చెప్పిన విధంగా ఆడియన్స్ నుండి అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.